6 June, 2026 | 1:43 AM

బినామీ లావాదేవీలు చేయడం చట్టవిరుద్ధం, జైలు శిక్ష తప్పదు

06-06-2026 12:00 AM

అదనపు ఆదాయపు పన్ను కమిషనర్ వై.శ్రీకాంత్ రెడ్డి

ముషీరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): భారత దేశ పౌరులు బినామీ లావాదేవీలు చేయడం చట్ట విరుద్ధమని, బినామీగా ఉన్న ఏ ఆస్తి అయినా, దాని యజమానికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం జప్తు చేస్తుందని తెలంగాణ, ఏపీ అదనపు ఆదాయపు పన్ను కమిషనర్ వై. శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

వాస్తవ యజమాని, బినామీదారు ఇద్దరికీ బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం1988 ప్రకారం కఠినమైన జైలు శిక్ష తప్పదని, బినామీగా ఉన్న ఆస్తులను తిరిగి పొందేందుకు అసలు యజమానులు కోర్టుల్లో దావాలు కూడా వేయలేరని ఆయన పేర్కొన్నారు.  హైదరాబాద్ సికింద్రాబాద్ తాజ్ త్రీస్టార్ లో శుక్రవారం  తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘భారతదేశంలో బినామీ చట్టం - పాటించడం, దర్యాప్తు అండ్ తీర్పు‘ అనే అంశంపై  సదస్సు సీఏ సాంబ మూర్తి అధ్యక్షతన జరిగింది.

ఈ సదస్సులో వై. శ్రీకాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ నల్లధనాన్ని అరికట్టే ప్రయత్నంలో 2016 లో మోదీ ప్రభుత్వం బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం1988 ను సవరించి ‘బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ చట్టం, 2016‘గా తీసుకవచ్చిందన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు సీఏ చంద్రశేఖర్ వేముల మాట్లాడారు.

ఈ సదస్సులో అసోసియేషన్  కార్యదర్శి సీఏ ఆశిష్ జోషి, కోశాధికారి  సోమేశ్వర్ నెమ్మాని, సలహాదారు సీఏ రామ్దేవ్ బుటాడా, కంపిటేషన్ కమిటీ చైర్మన్ సీఏ అమృత్ కుమార్ కోటా, ఉపాధ్యక్షులు సీఏ పి.వి. నారాయణ రావు, మాజీ అధ్యక్షులు సీఏ హితేష్ జైన్, సీఏ  పూర్ణచంద్రరావు,  గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సీఏ  రమణ రెడ్డి, సీఏ ప్రవల్లిక వేముల, సిఎ ప్రకాష్ చోకదా, సీఏ వెంకట్ రామ్, సీఏ శైలేంద్ర శర్మ, సిఏలీల కృష్ణ మోహన్   ఎన్.వి. చారి, అజయ్ వాల్వే, ఏపీ దహిమా తదితరులు పాల్గొన్నారు.