ఆఫ్ఘనిస్థాన్ ఎదురీత
పట్టుబిగించిన టీమిండియా
మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్
ఆప్ఘన్‌కు ఫాలోఆన్ గండం
భారత్ 564/8, ఆఫ్ఘనిస్థాన్ 113/5
ఐపీఎల్ మూడ్ నుంచి త్వరగానే బయటకొచ్చిన టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టులో దుమ్మురేపుతోంది. బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించి భారీస్కోరు నమోదు చేయగా.. తర్వాత బౌలర్లు చెలరేగిపోయారు. అరంగేట్రం చేసిన స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ మూడు వికెట్లతో ఆప్ఘనిస్థాన్‌ను దెబ్బకొట్టాడు. ప్రసిద్ధ కృష్ణ కూడా రాణించడంతో ఆప్ఘన్ టీమ్ ఎదురీదుతోంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్న వేళ ఆప్ఘనిస్థాన్ ఫాలోఆన్ గండం దాటడం కష్టంగానే కనిపిస్తోంది.
ముల్లాన్‌పూర్, జూన్ 7 : తొలిరోజే 368 పరుగుల స్కోరు సాధించిన భారత్ రెండోరోజు దూకుడుగా ఆడింది. వీలై నంత వేగంగా పరుగులు చేసే లక్ష్యంతో బ్యాటర్లు ధాటిగా ఆ డారు. శుభమన్ గిల్ 126 (15 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు ఔటవగా..పంత్ 81 (6 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్ చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. జురె ల్ (19) త్వరగానే ఔటైనా ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్ కీల క ఇన్నింగ్స్‌లు ఆడారు.
గత కొంతకాలంగా బ్యాట్‌తో నూ ఆకట్టుకుంటున్న వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. టెయిలెండర్లతో కలి సి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మానవ్ సుతార్‌తో కలిసి 54 , సిరాజ్‌తో క లిసి 30, కుల్దీప్ యాదవ్‌తో కలిసి 24 పరుగులు జోడించాడు. వా షింగ్టన్ సుందర్ 52 (5 ఫోర్లు, 1 సిక్సర్) ప రుగులు చేయగా.. మానవ్ సుతార్ 28 రన్స్ కు ఔటయ్యాడు. చివర్లో సిరాజ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 12 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు.
వీరి దూకుడుతోనే భార త్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 564 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో సలీమ్ సఫీ 6 వికెట్లు పడగొట్టాడు. నిజానికి 500 రన్స్ చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు. కానీ కెప్టెన్ గిల్ మా త్రం ఆ నిర్ణయం తీసుకోలేదు. మళ్లీ బ్యాటిం గ్ చేసే అవకాశం రాకూడదనే లక్ష్యంతో ఇ న్నింగ్స్ పొడిగించాడు. తర్వాత బరిలోకి దిగి న ఆప్ఘనిస్థాన్ ఆరంభం నుంచే తడబడింది. ఈ మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన స్పిన్ మ్యాజిక్ తో దెబ్బకొట్టాడు.
ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (16)ను ఔట్ చేయడం ద్వారా తన కెరీర్లో తొలి టెస్ట్ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. కాసేపటికే డేంజరస్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (12)ను కూడా పెవిలియన్ కు పం పాడు. రెండో రోజు ఆట ముగిసే సమయం లో అఫ్సర్ జజాయ్‌ను కూడా ఔట్ చేసి మూడు వికెట్లు సాధించాడు. అటు పేసర్ ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీయడంతో ఆప్ఘనిస్థాన్ 113 పరుగులకే సగం వికెట్లు కోల్పో యింది. మ్యాచ్ ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో, భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 451 పరు గులు వెనుకబడి ఉన్న ఆప్ఘన్ టీమ్ ఫాలో ఆన్ గండం దాటితే అద్భుతమే.తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను భారత్ 200 రన్స్ లో పే కట్టడి చేస్తే.. ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్ రెండోసారి బ్యా టింగ్ చేసే అవకాశం రాకపోవచ్చు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 564/8 డిక్లేర్డ్ (గిల్ 126, రాహుల్ 100, సాయి సుదర్శన్ 81, పంత్ 81 , వాషింగ్టన్ సుందర్ 52; సలీమ్ సఫీ 6/140)
ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 113/5 (రహమత్ షా 43 బ్యాటింగ్, షాహిది 20, సేదిఖుల్లా 17, అబ్దుల్ మాలిక్ 16; సుతార్ 3/21, ప్రసిద్ధ కృష్ణ 2/27)






