21 May, 2026 | 4:35 PM

మూడో కన్ను తెరిస్తేనే జ్ఞానోదయం

23-08-2024 12:00 AM

సద్గురు జగ్గీ వాసుదేవ్ :

శివుడు తన మూడవ కంటిని తెరవడం గురించి ఒక కథ ఉంది. భారతదేశంలో, ప్రేమ ఇంకా కామానికి ఒ క దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ‘కామదేవుడు’. కామం గు రించి చాలావరకూ ప్రజలు సూటిగా వ్యవహరించడానికి ఇష్టపడరు. మీరు దానిలో కొంత కళాత్మకత ఉండాలని కోరుకుం టారు. కాబట్టి, దాన్ని ‘ప్రేమ’గా భావిస్తారు. కామదేవుడు చెట్టు వెనక దాక్కొని, శివుని హృదయంలోకి మన్మథ బాణాన్ని వి సురుతాడు. దాంతో శివునికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. దాంతో జ్వలించే తన మూడో కన్నును తెరిచి, కాముడిని కా ల్చి బూడిద చేస్తాడు. సాధారణంగా అందరికీ చెప్పే కథ ఇది. కానీ, దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. కామం మీలో పుడుతుందా లేదా ఒక చెట్టు వెనకాల పుడుతుందా? 

కచ్చితంగా అది మీలోనే పుడుతుంది. ‘కామం’ అనేది వ్యతిరేక లింగం (స్త్రీ- పురుషుల) గురించే కాదు. ప్రతి కోరికా కూడా కామమే. అది శృంగారం గురించి అయినా, అధికారం గు రించి అయినా లేదా పదవి గురించి అయినా. ‘కామం’ అంటే ప్రాథమికంగా ఏమిటంటే, మీలో ఒక అసంపూర్ణ భావన ఉందీ అని. నాకు అది లేకపోతే, నేను సంపూర్ణం కాదనే భావనతో తపించిపోవడం అన్నమాట. 

శివుడు -కామదేవుల కథకు యోగపరమైన దృష్టికోణం ఉం ది. శివుడు యోగసాధన చేస్తున్నాడు. అంటే, తను సంపూర్ణం అవ్వడం కోసం మాత్రమే కాదు, అపరిమితంగా ఉండటానికి కూడా కృషి చేస్తున్నాడు. అప్పుడు శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. తన సొంత కామం పైకి రావడం చూసి, దాన్ని కా ల్చాడు. బూడిద నెమ్మదిగా ఆయన శరీరం నుండి బయటకు వచ్చింది. అది లోపల ఉన్న ప్రతిదీ భస్మం అయిపోయిందని చూపిస్తున్నది. మూడవ కన్ను తెరవడం ద్వారా ఆయన భౌతికతని మించిన ఒక పార్శ్వాన్ని తనలో తాను గ్రహించాడు. ఇక భౌతిక నిర్బంధాలన్నీ దూరంగా వదలిపోయాయి.

‘త్రినేత్రం’ అంటే ఏమిటి ?

మూడవ కన్ను అనేది భౌతికం కాని దాన్ని చూడగలిగే కంటిని సూచిస్తుంది. మీరు మీ చేతిని చూసినప్పుడు, అది కాంతిని అడ్డుకుని పరావర్తనం చెందిస్తుంది కాబట్టే, దాన్ని చూడగలుగుతున్నారు. మీరు గాలిని చూడలేరు ఎందుకంటే, అది కాంతిని అడ్డుకోదు. కానీ, గాలిలో కొద్దిగా పొగ ఉంటే చూడగలుగుతారు. ఎందుకంటే, మీరు కేవలం కాంతిని అడ్డుకునే దాన్ని మాత్రమే చూడగలరు. కాంతిని తనలోంచి వెళ్ళనిచ్చే దేన్నీ మీరు చూడలేరు. ఇంద్రియాలు అయిన ఈ రెండు కళ్ళ స్వభావం ఇది.

ఈ ఇంద్రియ నేత్రాలు భౌతికమైన దానిని చూడగలుగుతాయి. మీరు భౌతికమైంది కాని దానిని చూడాలీ అంటే, ఉన్న ఒకే ఒక్క మార్గం అంతర్ముఖులు అవ్వడమే. మనం మూడవ కన్ను అన్నప్పుడు, ప్రతీకాత్మకంగా, ఈ రెండు ఇంద్రియ నేత్రాలూ చూడలేని దానిని చూడడం గురించి మాట్లాడుతున్నాం. ఇంద్రియ నేత్రాల దృష్టి బాహ్యం వైపుగా ఉంటుంది. మూడవ కన్ను అనేది మీ అంతర్గతాన్ని అంటే మీ స్వభావాన్ని ఇంకా మీ ఉనికిని చూడడం కోసం. అదేదో మీ నుదుటిమీద మొలిచేదో లేదా పొడుచుకు వచ్చేదో కాదు. భౌతికతకి అతీతమైన దాన్ని గ్రహించగలిగే ఈ దృష్టి కోణాన్నే మూడవ కన్ను అంటారు.

జీవితాన్ని చూడడం..

మరొక అంశం ఏమిటంటే, ఇంద్రియ నేత్రాలు, కర్మతో చాలా కలుషితమై ఉంటాయి. కర్మ అంటే గత చర్యల తాలూకు మిగిలిపోయిన జ్ఞాపకం. మీరు చూసే ప్రతిదీకూడా ఈ కర్మ స్మృతులతో ప్రభావితమవుతుంది. మీరు అలా కాకుండా ఉండేలా చేయలేరు. మీరు ఎవరి వంకైనా చూస్తే ఇలా ఆలోచిస్తారు, ‘అతను బాగున్నాడు, అతను బాగో లేడు, ఇతను మంచివాడు, ఇతను మంచివాడు కాడు.’ దేన్నీకూడా అది ఉన్నట్టుగా చూడలేరు. ఎందుకంటే కర్మ స్మృతి మీ దృష్టినీ, చూడగలిగే సామర్థ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. 

ప్రతి దాన్నీ, ఉన్నది ఉన్నట్టుగా చూడగలగడానికి, లోతుకి చొ చ్చుకు పోగలిగేదీ, ఇంకా జ్ఞాపకాలతో కలుషితం కాబడనిదీ అయిన ఒక కన్ను తెరవాలి. సాంప్రదాయ పరంగా భార తదేశంలో జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం కాదు, ఎవరి మాటలనో వినడం కాదు లేదా సమాచారాన్ని పోగుచేసుకోవడం కాదు. తెలుసుకోవడం. అంటే జీవాన్ని తెలుసుకోవడా నికి కొత్త దృష్టిని లేదా అంతర్దృష్టిని తెరవడం. ఎంత ఆలోచించినా, ఎన్ని తత్వాలు అల్లుకున్నా, అది మీ మనసులో స్పష్టతని తీసుకురాలేదు. మీరు సృజించే ఆ తర్క సంబంధమైన స్పష్టత చాలా తేలికగా చెదిరి పోవచ్చు. క్లిష్ట సమయా లలో అది పూర్తిగా గందరగోళంలో పడిపోతుంది. సంపూర్ణమైన స్పష్టత వచ్చేది, మీ అంతర్నేత్రం తెరుచుకున్నప్పుడు మాత్రమే. అప్పుడు దానిని ఈ ప్రపంచంలో ఏ వ్యక్తీ, ఏ పరిస్థితీ చెదరగొట్టలేదు. నిజమైన జ్ఞానం కలగాలంటే, మీ మూడో కన్ను తెరచుకోవాల్సిందే.