22 April, 2026 | 1:32 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

చాలినన్ని బస్సులు నడపాలి

26-11-2024 12:00 AM

చాలినన్ని బస్సులు నడపాలి

రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ సికిందరాబాద్ జంటనగరాలలో బస్సులు చాలినంతగా తిరగడం లేదు. ఏ బస్సును చూసినా రద్దీతోనే కనిపిస్తున్నది. వేళకాని వేళ ఖాళీ బస్సులు తిప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. ప్రత్యేకించి ఎక్కువగా డిమాండ్ ఉన్న రూట్‌లలో బస్సులు ఎక్కువగా నడపాలి.

ముఖ్యంగా ఉదయం పూట స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనులకోసం మార్కెట్లకు వెళ్లే వ్యాపారులు వంటివారిని అందరినీ దృష్టిలోపెట్టుకొని ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపే దిశగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. పలు రూట్లను కలుపుతూ, పెద్ద పట్టణాలు, నగరాలకు బస్సుల సంఖ్యను పెంచవలసిన అవసరం కూడా ఉంది.

ఒకే రూటులో ఎక్కువ బస్సులను నడపకుండా, అన్ని రూట్లలో చాలినంత సంఖ్యలో బస్సులు నడపడానికి చర్యలు తీసుకోవాలి. ఇంకా, సాయంత్రం పూట కూడా ఎక్కువ బస్సులు వేయవలసి ఉంది. ప్రతి డిపోకు వీలైనన్ని అధిక బస్సులు మంజూరు చేయాలి. ప్రజాభీష్టం మేరకు అన్ని రూట్లలో బస్సులు అధిక సంఖ్యలో నడిపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్