31 July, 2026 | 9:42 PM

చికిత్స పొందుతూ మహిళ మృతి

31-07-2026 08:32 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి  చెందిన కొమెర ఎల్లయ్య కుమార్తె ఉప్పు సుమలత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మృతురాలిని 2017లో కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన ఉప్పు రవితో వివాహం జరిపించారు. వీరికి ఒక పాప ఇద్దరు బాబులు జన్మించినారు.

మృతురాలి భర్త రవి బాగా తాగుడికి బానిసై ప్రతిరోజు మానసికంగా శారీరకంగా వేధించుచు వచ్చాడు. సుమారు పది రోజుల క్రితం పొట్టలో ఛాతిపై కొట్టగా ఈ నెల 21న నిజామాబాద్  హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యింది. మరల  29, 30 న రెండు రోజులు  ఆసుపత్రిలో చూపించుకొని తన తల్లిగారి ఇంటికి అంకాపూర్ గ్రామం వచ్చింది. అట్టి గాయాలతో భరించలేక శుక్రవారం తెల్లవారుజామున  చనిపోయిందని వివరించారు. మృతురాలు తండ్రి ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ విచారించారు.