31 July, 2026 | 9:03 PM

వర్షలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

31-07-2026 08:25 PM

* మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి

మెట్ పల్లి,(విజయక్రాంతి): వర్షలపై పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షలకు దెబ్బ తిన్న ప్రాంతాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ పదకొండవ వార్డు ప్రైమరీ స్కూల్లో వర్షపు నీరు చేరినందున జెసిబి ద్వారా కచ్చా కాలువ తవ్వించి మోటార్ల ద్వారా వర్షపు నీటిని బయటకు పంపడం జరిగిందని తెలిపారు.

ఇరవై రెండవ వార్డులో స్లాబ్ నుండి వర్షం నీరు వచ్చుచున్నందున రిపేర్ చేయించడానికి పరిశీలించడం జరిగింది అని తెలిపారు. మూడో వార్డులో వర్షం వలన ఇల్లు కూలిపోవడంతో వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే డ్రై డే పురస్కరించుకొని ఇరవై రెండవ వార్డులో కూలర్ల లో ఉన్న నీటిని తొలగించి కూలరు బోర్ల పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీ ఓంకార్ నవీన్, కౌన్సిలర్ లు రెబ్బెస్ మహేష్, బత్తుల నరేష్, అంగిడి పురుషోత్తం, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ముజీబ్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.