31 July, 2026 | 9:42 PM

దివ్యాంగులను గుర్తించి పాఠశాలలో చేయించాలి

31-07-2026 08:34 PM

ఆర్మూర్‌,(విజయక్రాంతి): ఆర్మూర్ మండలంలో వివిధ వైకల్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి 6 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలను సమీపంలోని పాఠశాలల్లో చేర్పించాలి అని ఆర్మూర్ మండల విద్యాధికారి రవీందర్ సూచించారు. ఆర్మూర్‌ పట్టణంలోని భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా వనరుల కేంద్రాన్ని శుక్రవారం  ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు.

దివ్యాంగ విద్యార్థులకు టీఎల్‌ఎం సహకారంతో విద్యా బుద్దులు నేర్పించడాన్ని పరిశీలించారు. కార్యాలయంలో దివ్యాంగ విద్యార్థులు ప్రొఫైల్స్, ఐఈపీలు తదితరత రికార్డులను పరిశీలించి ఐఈఆర్పీలు కిషన్, సురేష్‌తో మాట్లాడారు. డెయిలీ లివింగ్‌ స్కిల్స్‌తో పాటు సబ్జెక్టులను సైతం వారికి బోధించాలని పేర్కొన్నారు.  సిబ్బంది అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసారు.