28 August, 2026 | 8:35 AM

‘డిండి’ రైతులకు న్యాయం చేయండి

28-08-2026 02:44 AM

రంగారెడ్డి, ఆగస్టు 27 (విజయక్రాంతి): డిండి ఎత్తిపోతల పథకం వల్ల ఉనికి కోల్పోతున్న కల్వకుర్తి ప్రాంత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayan Reddy) మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు విజ్ఞప్తి చేశారు. డిండి ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులతో గురువారం సచివాలయంలో మంత్రులు, సంబంధిత శాఖల అధి కా రులు అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రైతుల పక్షాన ఎమ్మెల్యే కసిరెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. స్పందించిన మంత్రులు సాధ్యమైనంత మేర భూసేకరణను తగ్గించి రైతులను కాపాడాలని రైతుల ప్రయోజనాలు, ప్రజల జీవనోపాధికి పెద్దపీట వేస్తూ.. ముంపు నష్టాన్ని పూర్తిస్థాయిలో నివారించేందుకు లేదా తగ్గించేందుకు అన్ని సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.