కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం
- జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి రావాలని ఆహ్వానం
- ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. హర్యానాలోని ప్రముఖ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ(Jindal Global University)కి విచ్చేసి విద్యార్థులు(students), అధ్యాపకుల(facult)తో సంభాషించడంతో పాటు వారిని ఉద్దేశించి ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్’ (Distinguished Public Lecture) ఇవ్వాలని యూనివర్సిటీ కేటీఆర్‌ను ఆహ్వానించింది. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ (డాక్టర్) సి. రాజ్ కుమార్ ఈ మేరకు గురువారం కేటీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు.
కేటీఆర్ రాక, ఆయన ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తాయన్నారు. కేటీఆర్‌కు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి సెప్టెంబర్, అక్టోబర్ 2026లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారత్‌లోనే తొలి రాజ్యాంగ మ్యూజి యం, రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అకాడమీని సందర్శించాలని కూడా కేటీఆర్‌ను ఆహ్వానించారు. భారత రాజ్యాంగం ఆమోదానికి 75 ఏళ్లు పూర్తున సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మ్యూజియానికి హాజరవుతానని మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు.






