21-07-2025 01:19:04 AM
- సీఎంను కోరిన ఎంపీ ఆర్ కృష్ణయ్య
- ఆగస్టు 3న రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తామని వెల్లడి
ముషీరాబాద్, జూలై 20: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల ఆమలు, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించిన అంశాలపై భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి ఆగస్టు 3న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఈ సమావేశానికి జిల్లా, మండల, రాష్ట్రస్థాయి ముఖ్య నాయకులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అమలుకు తీసుకోవలసిన కార్యచరణ రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటే ష్ ముదిరాజ్, జిల్లపెళ్లి అంజి, పగిళ్ల సతీష్ కుమార్, సుధాకర్, మోది రాందేవ్, పృద్విరాజ్, స్వామి గౌడ్, సత్తయ్య , బాలాస్వామి, లింగయ్య యాదవ్, ఆశిష్ గౌడ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.