calender_icon.png 21 July, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసులిస్తే అడిగిన వారికి రికార్డులు

21-07-2025 01:17:38 AM

రేవల్లి తాసిల్దార్ కార్యాలయ ఉద్యోగుల నిర్వాకం 

రేవల్లి: జూలై 20: మండల కేంద్రం రేవల్లిలో గల తహశీల్దార్ కార్యాలయంలోని విలువైన భూ రికార్డులను ఇక్కడి సిబ్బంది కాసులిస్తే అడిగినవారికి ఇచ్చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భూముల మరియు ఇండ్ల స్థలాల విలువైన రికార్డులను ప్రభుత్వం తాసిల్దార్ కార్యాలయంలో భద్రపరిచి ఆయా గ్రామాల ప్రజల అవసరాల నిమిత్తం కార్యాలయ సిబ్బంది అట్టి రికార్డులను పరిశీలించి మార్పులను చేర్పులను మరియు అభ్యంతరాలను పరిష్కరిస్తుంటారు,

అవసరం ఉన్నవారికి వాటి ప్రతులను జిరాక్స్ రూపేనా కార్యాలయ సిబ్బంది వెంబడుండి ప్రజలకు అందిస్తుంటారు, కానీ ఇక్కడి సిబ్బంది ఇక్కడే చేతి్వాటాన్ని ప్రయోగించి రికార్డులను కాసులు తీసుకొని బయటికి వ్యక్తులకు అందజేస్తున్నారు, ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకారం గొల్లపల్లి గ్రామంలో 1990లో అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు గ్రామ సమీపంలో దాదాపు 70 మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి పట్టాలను అందజేశారు,

కాలక్రమమైన అవి ఆక్రమణకు గురయ్యాయి, వాటి రికార్డులను పరిశీలించడానికి లబ్ధిదారులు రేవల్లి తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా ఈ నెల 11 అట్టి రికార్డును జిరాక్స్ లు తీసీయడానికై సమీపంలోని జిరాక్స్ సెంటర్లకు కార్యాలయ సిబ్బంది ఆయిన రవి కి రికార్డు ఇచ్చి పంపగా దరఖాస్తుదారు నుండి 500 రూపాయలు తీసుకొని రికార్డు అతను చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు,

ఈ విషయం విజయ క్రాంతి తాసిల్దార్ లక్ష్మీదేవి దృష్టికి తీసుకెళ్లగా రికార్డు తీసుకెళ్లిన వ్యక్తిని తిరిగి ఇవ్వాలని కోరగా రికార్డును తీసుకొని తాసిల్దార్ కార్యాలయానికి రాగ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో వెనుతిరిగాడు అందులో ఉద్దేశ పూర్వకంగా మార్పులు,చేర్పులు చేయడానికి అవకాశం ఉంది, అంతేకాకుండ కాసులు ఇచ్చినచో రేవల్లి తహసిల్దార్ కార్యాలయంలో కానిపనులు కూడా అవుతాయని

ఈ సంఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు, ఈ విషయమై తాసిల్దార్ లక్ష్మీదేవిని విరణ కొరగా అట్టి ఫైల్ నేటికిని కార్యాలయానికి చేరలేదని తన కార్యాలయ సిబ్బందికి ఇచ్చి పంపించిన మాట వాస్తవమే అయినా వెంటనే తెప్పించుకుంటానని అన్నారు, ఇలాంటి విషయాలను తన దృష్టికి తీసుకురావద్దని ఆమె విసుక్కున్నారు.