calender_icon.png 21 July, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖరీఫ్ సాగుకు ఎరువులు అందుబాటులో ఉన్నాయి

21-07-2025 01:19:08 AM

అయిజ జూలై 20. రైతులకు ఖరీఫ్ సాగుకు సరిపడ ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఉమ్మడి జిల్లా సింగిలివిండో చైర్మన్ల సంఘం జిల్లా అధ్యక్షులు అయిజ సింగిల్ విండో అధ్యక్షులు పోతుల మదుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో మాట్లాడారు. రైతులు అపోహకు గురయ్యి అధికంగా ఎరువులు కొను గోలు చేసి నిల్వ చేసుకోవటం సరికాదని హితవు పలికారు.

రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం సహకార సంఘాలలో ఎక్కువ మొత్తంలో ఎరువుల పంపిణి కార్యచరణ సాగిస్తుందని వివరించారు. మార్క్ ఫెడ్ నుండి ఎంత ఎరువులు కోరితే అంత ఎరువులు పంపేందుకు సిద్ధంగా ఉం దని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో ఆర్జీఎస్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు ప్రారంభం అవుతాయని అన్నారు.

అందుకు తగినట్లుగానే ఆర్టిఎస్ అకట్టు పరిది గ్రామమైన చిన్నతండ్రపాడు సిం గిల్ విండో ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రం ఏర్పాట్లు చేస్తామని ఆర్జీఎస్ రైతులకు హామి ఇచ్చారు. దీనితో రైతులకు సమయం కలిసి రావటమే కాకుండా ఖర్చులు సైతం తగ్గుతాయని వివరించారు.