calender_icon.png 19 December, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ.ఎన్.టి మెగా వైద్య శిబిరం

18-12-2025 10:13:30 PM

హనుమకొండ (విజయక్రాంతి): పబ్లిక్ గార్డెన్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ గౌడ రమేష్, డాక్టర్ ఉదయ్ కిరణ్ సిబ్బంది మల్లికార్జున్ సాయి కుమార్ గణేష్ అనితలు సుమారుగా 180 మందికి చెవి, ముక్కు, గొంతు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాంధీ మాట్లాడుతూ గతంలో కూడా చాలాసార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని, వాకర్స్ కోసం ఇలాంటి సేవ చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వాకర్స్ దేవునూరి గిరిజ, అన్నపూర్ణ, వనమాల, స్వర్ణలత, తాళ్లపల్లి సత్యనారాయణ, శంకర్రావు, హాసన్ అలీ, రిటైర్డ్ ఎస్సై పులి సమ్మయ్య, రాఘవరెడ్డి విజయ్ కుమార్, కుమారస్వామి, శ్రీధర్, గంగాధర్, వెంకట్ రెడ్డి, కిషోర్, సంజీవ్, భాస్కర్ కుమార్రాజ్, ప్రభాకర్, శ్రీనివాస్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.