18-12-2025 10:17:00 PM
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుక..
స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన కోవ లక్ష్మీ దంపతులు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సోనేరావు, కుమారుడు సాయినాథ్ దంపతులు నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్యస్వామిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మణికంఠుడికి అభిషేకం నిర్వహించి మెట్ల పూజ చేపట్టారు. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ దంపతులు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్, రాజంపేట సర్పంచ్ బుర్సా పోచయ్య పాటు అయ్యప్ప స్వాములు, భక్తులు, కోవలక్ష్మి అభిమానులు హాజరయ్యారు.