6 May, 2026 | 1:12 AM

వేములవాడ ప్యాక్స్ చైర్మన్‌గా ఏనుగు తిరుపతి రెడ్డి బాధ్యతలు స్వీకారం

06-05-2026 12:01 AM

వేములవాడ, మే 5,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గతంలో రద్దు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను తిరిగి పునర్నియమించాలని హైకోర్టు ఆదేశాల మేరకు, వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) చైర్మన్గా ఏనుగు తిరుపతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా పాలక వర్గ సభ్యులు, అధికారులు, స్థానిక నాయకుల సమక్షంలో బాధ్యతలు చేపట్టి, సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పాలక వర్గ సభ్యులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.