6 May, 2026 | 1:13 AM

సాంకేతికవృద్ధి సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి

06-05-2026 12:00 AM

డా. సీహెచ్.వి. పురుషోత్తం రెడ్డి

మొయినాబాద్, మే 5(విజయ క్రాంతి): సాంకేతిక వృద్ధి సమాజ అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని డాక్టర్ సీహెచ్.వి. పురుషోత్తం రెడ్డి అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్లో గల చైతన్య డీమ్డ్ టూ బీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆధారిత సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ మరియు ఆల్గారిథమ్స్ అంశంపై పరిశోధన చేసిన యాకూబ్ రెడ్డి కంచరకుంటకు పీహెచ్.డి డిగ్రీని డా. పురుషోత్తం రెడ్డి అందజేశారు. ఈ పరిశోధన జీ. శంకర్ లింగం పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంప్యూటర్ సైన్స్ రంగంలో జరుగుతున్న పరిశోధనలు జాతీయ అభివృద్ధికి కీలకమని తెలిపారు.

ముఖ్యంగా సైబర్ భద్రత కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత పరిష్కారాలపై పరిశోధనలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయని అన్నారు. ఇలాంటి పరిశోధనలు దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తాయని, యువ పరిశోధకులు కొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డా. సీహెచ్. సాత్వికా రెడ్డి, వైస్ చాన్సలర్ జీ. శంకర్ లింగం, రిజిస్ట్రార్ యం. రవీందర్, డీన్ ఆర్ అండ్ డి ఆచార్య ఏ. రాజు, డీన్ ఫ్యాకల్టీ ఆచార్య ఎం. జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.