27 July, 2026 | 12:05 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం

07-06-2026 12:00 AM

కాప్రా తాసీల్దార్ మతిన్

జవహర్‌నగర్, జూన్ 6 (విజయక్రాంతి): సర్కారు భూముల పరిరక్షయే ధ్యేయంగా పనిచేస్తామని జవహర్ నగర్ లోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కబ్జాదారులపై ప్రత్యేక నజరు పెడుతున్నామని కాప్రా తాసిల్దార్ మతిన్  హెచ్చరిం చారు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో అక్రమంగా వెలిసిన కట్టడాలను కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు శనివారం గిరధవార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.

ఈ సందర్భంగా మతిన్ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను కాపాడుతామని పేద ప్రజలు ప్రభుత్వ భూములు కొని మోసపోవద్దని సూచించారు. వికలాంగుల కాలనీ, మోహన్ రావు కాలనీ, సంతోష్ నగర్ ,డెంటల్ కాలేజీ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను జెసిబి సహాయంతో నేలమట్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.