17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పర్యావరణ రక్షణ ప్రతి ఒకరి బాధ్యత

06-06-2025 12:19 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూన్ 5 (విజయక్రాంతి) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో వారి కార్యాలయ ప్రాంగణంలో  ఏర్పాటుచేసిన మొక్కలు నాటె కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం, సంరక్షించడం దినచర్యలలో భాగం కావాలన్నారు. 

 రూరల్ ఏరియాలలో డి ఆర్ డి ఓ, పంచాయతీరాజ్ సిబ్బంది కలిసి రాబోవు వన మహోత్సవంలో ఒక ప్రణాళిక బద్ధంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు.  ఎస్సీ కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్ జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం నాయక్ అధికారి శ్రీనివాస్ డి సి ఓ పద్మ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆర్డీవో వేణుమాధవ్, ఎఫ్ ఆర్ వో ఎస్ ఆనంద రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సీతారా మయ్య, మంజుల, వెంకటేశ్వర్లు, గోపి, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అధికారులు పాల్గొన్నారు

హెల్త్ క్యాంపు పరిశీలన..

సూర్యాపేట, జూన్ 5 (విజయక్రాంతి) : పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని వారి ఆరోగ్య పరిరక్షణ కొరకు మున్సిపాల్టీ వారు హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. 100 రోజుల ప్రణాళిక లో భాగంగా సూర్యాపేట మున్సిపాల్టీలో పారిశుద్ధ్య విభాగం సిబ్బందికి ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు గురువారం పరిశీలించారు.  అడిషినల్ కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి డాక్టర్ పర్స రాంబాబు,కమీషనర్ బి.శ్రీనివాస్,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, డాక్టర్ మల్సూర్ ,డాక్టర్ ప్రవళిక, పాల్గొన్నారు.