17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రసూల్‌పుర ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

06-06-2025 12:20 AM

అధికారులను ఆదేశించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): రసూల్‌పుర ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో గురువారం కమిషనర్ సికింద్రాబాద్ జోన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బస్ స్టాప్లను పరిశీలించారు.

రైల్వే సరిహద్దు నుంచి 24 మీటర్ల వరకు భూమి అవసరం ఉందని అధికారులు కమిషనర్‌కు తెలియజేశారు. బస్‌స్టా ప్‌నకు ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి దాన్ని తరలించాల్సిన అవసరం ఉందని ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివాస్ కమిషనర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ హెచ్‌సిటీ ద్వారా రసూల్‌ఫుర వద్ద చేపట్టనున్న ఫ్లైఓవర్ నిర్మాణ స్థలాన్ని వెంటనే పరిశీలించి భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.