19-01-2026 04:54:59 PM
మోతే,(విజయక్రాంతి): బాల్య వివాహల నిర్ములన ప్రతిఒక్కరి భాధ్యత అని గోపతండా సర్పంచ్ భూక్య బిక్కు, నేరడవాయి సర్పంచ్ దారమళ్ళ గోవర్ధన్, తుమ్మ గూడెంసర్పంచ్ కుక్క ధనమ్మ బిక్షం అన్నారు. సోమవారం మండల పరిధిలోని గోపతండ, నేరడవాయి, తుమ్మ గూడెం గ్రామాలలో జరిగిన జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహల నిర్ములన అనే అంశంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో సర్పంచ్ లు బిక్కు గోవర్ధన్ ధనమ్మ బిక్షం మాట్లాడారు.
గ్రామాలలో నేటికీ చదువు లేక చట్టాలపైన అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాలలో చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేయడంతో మానసిక వికాసం శారీరక దృఢత్వం ఉండదని జబ్బుల బారిన పడి కుటుంబం చిన్నభిన్నం అవుతుందని ఆర్ధిక ఇబ్బందులతో కటుంబ వ్యవస్థ వీధిన పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి కోఆర్డినేటర్ గుద్దేటి వెంకన్న, పి యల్ వి లు పల్లెల లక్ష్మణ్, యస్ కృష్ణవేణి గట్టిగుండ్ల రాము, గ్రామ ఉప సర్పంచ్ లు మాలోతు ఈశ్వరి రవి, కొచ్చర్ల సుజాత శ్రీను, ఉబ్బపల్లి ఈదయ్య, వార్డ్ మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.