19-01-2026 04:57:55 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం ధన్నూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్ కోరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సర్పంచ్ విన్నపాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెంటనే మీ ఊరికి త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తాననిహామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.ఎమ్మెల్యేను కలిసినా వారిలో సర్పంచ్ వెంట ఆ గ్రామ ఉప సర్పంచ్ కుటుంబీకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు ఉన్నారు.