ముఖ్యమంత్రి పేరులో తప్పులు
15-05-2026 08:51 PM
కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పేరు తప్పుగా ముద్రించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శిలాఫలకంపై “ఏనుమూల”, మరొకదానిపై “అనుముల” అని ముద్రించడం అధికారుల నిర్లక్ష్యమని విమర్శించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అనిల్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, కౌన్సిలర్లు కార్తీక్, గోవింద్, నాయకులు ఆసిఫ్, జావిద్, రఫు, నిఖిల్, సాయి, శ్రీనివాస్, శివ, రాజన్న తదితరులు పాల్గొన్నారు.






