పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం
టీపీసీసీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ ఎండి అజీజ్ పాషా
మంత్రి ఉత్తమ్ సహకారంతో నియామకం- రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు
హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్‌గా ఇటీవల నియామకమైన దొంగరి వెంకటేశ్వర్లును కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుక్రవారం ఆయనను చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు, బొకేలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో తన నియామకం జరిగిందని రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేసి ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ ఎండి అజీజ్ పాషా సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






