20 March, 2026 | 4:44 AM

శ్రీ మహాలక్ష్మి రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక వేడుకలు

20-03-2026 01:24 AM

వేములవాడ, మార్చి 19,(విజయక్రాంతి )ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఏరువాక పనుల కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు తోట రాజు, కొక్కుల బాలకిషన్, తూమ్ మధు, కొండ శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి రాంబాబు గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున హాజరై సంప్రదాయ పద్ధతిలో ఏరువాక పనులు నిర్వహించారు. రైతాంగానికి ఉగాది పండుగ ప్రత్యేకతను తెలియజేస్తూ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.