20 March, 2026 | 6:19 AM

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్

20-03-2026 01:25 AM

వైష్ణవిని మానసికంగా,శారీరకంగా వేధించిన హరిబాబు తల్లి అన్నయ్యలు

కోరుట్ల మార్చి 19 (విజయక్రాంతి) కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్నం వేధింపులు నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నట్లు దర్యాప్తులో భాగంగా నిందితుడు హరిబాబుకు సహకరించిన బాధితురాలుని కట్నం కోసం మానసికంగా శారీరకంగా వేధించినట్లు తెలిసిన హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి అన్నయ్యలు చిత్తారి ఆనంద్ చిత్తారి అశోక్ లపై కట్నం వేధింపులు,

హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి మెట్పల్లి డివిజన్ పోలీస్ అధికారి రాములు ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి దర్యాప్తు చేపట్టి ఈ కేసులో నిందితులైన చిత్తారిలక్ష్మీ చిత్తారి ఆనంద్ చిత్తారి అశోక్ లను తేదీ 19 326 గురువారం అరెస్టు చేసి డిఎస్పి ముందు హాజరు పరచగా డిఎస్పి వారిని న్యాయస్థానం ఎదుట హాజరపరిచి రిమాండ్ కు తరలించడం జరిగింది