14 August, 2026 | 11:51 PM

జూన్ 8 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్

25-05-2024 12:49 AM

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): తెలంగాణ ఈసెట్ కౌన్సె లింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తా రు. ఇందుకు రెండు విడుతల్లో కౌన్సెలింగ్ చేపడతారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడత జూన్ 8 నుం చి 11 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. జూన్ 10 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూన 18న తొలివిడుత సీట్ల కేటాయింపు ఉం టుంది. జూలై 15వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించి, అదే నెల 21న తుది విడుత సీట్లను కేటాయిస్తారు. జూలై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తారు.