అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులా..?
బీజేపీ ఎమ్మెల్యేలు ధ్వజం
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేమిటని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పాటిల్, ధన్ పాల్ సూర్యనారాయణ ప్రశ్నించా రు. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన అంటూ మండిపడ్డారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. ఆధారాలతో సహా అవినీతి, అక్రమాలను బయటపెడితే సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొహం చాటేశారని విమర్శించా రు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కార్యకర్తలతో కేసులు పెట్టించడం అవివేకమని ధ్వజమెత్తారు. ఏలేటి చేసిన అవినీతి ఆరో పణలు వాస్తవం కాదంటే దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని కేసులైనా ఎదుర్కుంటామని, ఎన్ని జైళ్లకైనా వెళ్తామని అన్నారు.






