14 July, 2026 | 5:00 PM

Breaking News

అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •  

రేవంత్ సర్కార్ ను హెచ్చరించిన ఈటల రాజేందర్

23-10-2024 01:12 PM

పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం: ఈటల రాజేందర్

హైదరాబాద్: పేదల జీవితాలతో ఆటలు వద్దని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలు బుధవారం పరిశీలిస్తున్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వరంలో మూసీ పరివాహక ప్రాంతాలో పర్యటిస్తున్నారు. రామంతాపూర్ లోని బాలకృష్ణనగర్ ను నేతలు పరిశీలిలించారు. తమ ఇళ్లు కూల్చకుండా చూడాలని స్థానికులు ఈటలను కోరారు.

ఎన్నో కష్టాలుపడి ఇల్లు కట్టుకున్న వారిని ఆందోళనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30-40 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. శని, ఆదివారం వస్తే చాలు.. వీరంతా భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం, బాధితులకు మద్దతుగా ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు.