calender_icon.png 29 July, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఏసీ చైర్మన్ లేకున్నా ఫైవ్ మెన్ కమిటీ వేసుకుంటాం

29-07-2025 02:33:02 AM

  1. జేఏసీని మనుగడలోకి తెచ్చేందుకు ఆర్టీసీ కార్మికుల యత్నం
  2. త్వరలో ఆర్టీసీ జేఏసీ పునరుద్ధరణకు అవకాశం

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ఆర్టీసీ జేఏసీ ద్వారా తమ హక్కులను సాధించుకొనేందుకు ప్రయత్నిస్తూ వచ్చిన కార్మి కులు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. అన్ని యూనియన్లను కలిపి విశాల జేఏసీ ఏర్పాటు చేస్తే పోరాటం మరింత ఉధృతం చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని భావించినా.. అది సాధ్యం కాకపో వడంతో మరోసారి ఏదో ఒక రూపంలో సంఘటితమయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

జేఏసీ చైర్మన్ పోస్టుకు పోటీ పెరగడంతో నేనంటే నేనంటూ కార్మిక సం ఘాల నేతలు మొండిపట్టు పట్టడంతో జేఏసీ ఏర్పాటే ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ఆర్టీసీలో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేందుకు కార్మికులకు ఓ వేదిక అంటూ లేకుండా పోయింది. ప్రస్తుతం లేబ ర్ కమిషన్ వద్ద ఆర్టీసీలో గుర్తింపు పొందిన 11 యూనియన్లలో రెండు, మూడు యూనియన్లు మినహా మిగతా యూనియన్లంతా జేఏసీ ఏర్పాటు త్వరగా పూర్తయ్యి..

కార్మికుల కోసం పోరాటం చేసేందుకు సిద్ధపడు తున్నా.. రెండు, మూడు సంఘాలకు చెందిన కొందరు నేతలు మాత్రం జేఏసీ ఏర్పాటుకు అడ్డుతగులుతున్నట్టుగా ఆరోపిస్తున్నారు. వారే తిరిగి జేఏసీ ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యం లో సరికొత్త అజెండాను తెరపైకి తీసుకొస్తున్నారు. జేఏసీ చైర్మన్ పోస్టుకు బదులుగా ముఖ్యమైన 5 యూనియన్లకు చెందిన నేతలతో ఫైవ్‌మెన్ కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలోనే జేఏసీ వ్యవహారాలు నడిపించేందుకు కసరత్తు చేస్తున్నారు.

దీంతో తామే జేఏసీని నడిపించాలనే ప్రయత్నానికి అంతా దూరమై జేఏసీ ముందుకు నడిపించేందుకు అవకాశం ఉంటుందని యూనియన్ల నేతలు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముం దు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ట్రేడ్ యూనియన్ గుర్తింపు పునరుద్ధరణ సహా ఎన్నో ఆకర్షణీయమైన హామీలిచ్చింది. కార్మికులకు జరుగు తున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు త్వరలో ఫైవ్‌మెన్ కమిటీ ఏర్పాటుకు సంఘాలు సిద్ధమవుతున్నాయి.