calender_icon.png 29 July, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

935 కిలోల గంజాయి పట్టివేత

29-07-2025 02:33:27 AM

  1. విలువ రూ.5 కోట్లు
  2. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద పట్టుకున్న పోలీసులు
  3. ఒడిశా నుంచి ఏపీ మీదుగా మహారాష్ట్రకు తరలింపు
  4. పక్కా సమాచారంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు
  5. ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు 

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 28: రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద రూ.5 కోట్లు విలువజేసే 935 కిలోల గంజాయిని సోమవారం ఈగల్ టీమ్, రాచకొండ నార్కొటింక్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో సోమవారం వాహనాల తనిఖీలు నిర్వహించి, అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పాత నేరస్థుఢు పవార్ కుమార్ బడు, విక్కీ సేత్ (ఒడిశా) సచిన్ గంగారమ్ చౌహాన్ మరో ఇద్దరితో కలిసి అంతర్ రాష్ట్ర ముఠాగా ఏర్ప డి పలు రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్నారు.

ఈ నెల 23న పవార్ కుమార్, సమాధాన్ కాంతిలాల్ భిసే, వినాయక్ బాబా సాహెబ్ పవార్ అద్దె కారులో మహారాష్ట్ర నుంచి ఏపీలోని రాజమండ్రికి చేరుకున్నా రు. అక్కడ ఉన్న సచిన్‌ను కలిసి గంజాయిని ట్రక్కులోకి ఎక్కించుకున్నారు. ఎక్కడనైనా తనిఖీలను నిర్వహిస్తే వాటి నుంచి తప్పించుకోవడానికి వ్యాన్ ముందు ఇన్నోవా కారు ఎస్కార్ట్ చేస్తూ  కాన్వాయ్‌తో పాటు మహారాష్ట్రకు బయలుదేరారు.

ఈ గంజాయిని పండ్ల ట్రేల కింద దాచి రవాణ చేస్తుంటారని పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదు గా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు ఖమ్మం, రాచకొండ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈగల్ టీమ్, రాచకొండ పోలీసులు రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. వ్యాన్‌లో గం జాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. అందులో 935.11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని విలువ రూ.5 కోట్లు ఉం టుందని అధికారులు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.