calender_icon.png 29 July, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్

29-07-2025 02:30:27 AM

ఆగస్టు 23, 24 తేదీల్లో నిర్వహణ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను ఆరోగ్యకరమైన, చైతన్యవంతమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్‌ఎండీసీ లిమిటెడ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ప్రతిష్టాత్మక హైదరాబాద్ మారథాన్ యొ క్క 14వ ఎడిషన్‌ను ప్రకటించాయి. వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ రేస్ హోదా పొందిన ఈ మారథాన్ దేశంలోనే రెండవ అతిపెద్దదిగా గుర్తింపు పొందిం ది.

ఈ ఏడాది ఆగస్టు 23, 24 తేదీల్లో జరగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే 28,000 మందికిపైగా పోటీదారు లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రము ఖ బాక్సర్, ఒలింపియ న్ నిఖత్ జరీన్, ఎన్‌ఎండీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీ వ్ సహి, బ్యాంక్ తెలంగాణ రీజనల్ హెడ్  శ్రీనివాస్ గుట్టి, రేస్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చా కలిసి అధికారిక టీ-షర్ట్, మెడల్స్‌ను ఆవిష్కరించారు.