ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి
29-06-2026 12:00 AM
తాడ్వాయి, జూన్, 28( విజయ క్రాంతి): ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కల మందు వేయించాలని ఎర్రపహాడ్ వైద్యాధికారి కాసిం తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఆయన స్థానిక సర్పంచ్ మల్లవ్వ తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. మండలంలో మొత్తం ఐదేళ్ల లోపు పిల్లలు 4810 ఉండగా అందులో 4245 మంది పిల్లలకు చుక్కల మందు వేసినట్లు తెలిపారు. మిగతా 565 మంది పిల్లలకు సిబ్బంది ఇంటింటికి తిరిగి చుక్కల మందు వేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






