29 June, 2026 | 2:03 AM

గ్రామ గ్రామాన పల్స్ పోలియో

29-06-2026 12:00 AM

సదాశివనగర్, జూన్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు భూంపల్లి, జనగాం, లింగంపల్లి, తుక్కుజివాడి, తిమ్మాజివాడి, ఉత్తనూర్, వజ్జపల్లి. వజ్జపల్లి తండా. యాచారం తండా సజ్జనాయక్  తాండ. పూర్వ నాయక్ తాండ, దగ్గి, కల్వరాల్. పద్మా జీ వాడి, మొడేగం.అడ్లూరు ఎల్లారెడ్డి,  మర్కల్, తిరుమన పల్లి , కుప్రియాల్ ,ధర్మరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈరోజు నిర్వహించిన పల్స్ పోలి యో కార్యక్రమం విజయవంతంగా జరిగిం ది.

మొత్తం 3,044 మంది 5 సంవత్సరాల లోపు చిన్నారులు లక్ష్యంగా ఉండగా, 96.4% కవరేజ్ సాధించి 2,934 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయబడినాయి.  80 మంది సిబ్బంది ( ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్లు), 2 సూపర్వైజర్ బృందాలు, 1 మొబైల్ టీమ్, 1 ట్రాన్సిట్ టీమ్ పాల్గొని 19 పోలియో బూత్ల ద్వారా సేవలు అందించారు.    హెల్త్ డిపార్ట్మెంట్ నాగరాజు, ఏఎన్‌ఎమ్ లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.