29 June, 2026 | 2:03 AM

భార్యతో గొడవపడి యువకుడి ఆత్మహత్య

29-06-2026 12:00 AM

గాంధారి, జూన్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కుటుంబ కలహాలతో యువకు డు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకున్నది.. స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన తాడ్వాయి(భోగం) రవీందర్ (28)  మండల కేంద్రానికే చెందిన యువతి తాడ్వాయి కీర్తన అనే యువతిని వివాహం చేసుకున్నాడు,

అమ్మాయి ఇంటికి ఇల్లరికం వచ్చినట్టు వారు తెలిపారు. మృతుడి భార్య  ఫోన్ లేపడం లేదని  శనివారం నాడు  భార్యతో గొడవపడి మనస్తాపంతో క్షణికావేశంలో స్థానికంగా గల పెద్దవాగులో సంగెం రేవు వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందినట్టు స్థానిక ఎస్‌ఐ మహేందర్ తెలిపారు. మృతుడికి భార్య, రెండు సంవత్సరాల బాబు, ఒక పాప ఉన్నట్లు ఆయన తెలిపారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు  తెలిపారు.