14 July, 2026 | 7:17 PM

Breaking News

ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •  

ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

14-07-2026 07:16 PM

పిర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిర్జదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9, 10 వార్డులలో కొనసాగుతున్న సంక్షిప్త ఓటర్ సవరణ కార్యక్రమంలో జక్క వెంకట్ రెడ్డి  పాల్గొని సర్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై బి ఎల్ ఓ, బీఆర్ఎస్ పార్టీ బీఎల్ ఎలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ మాజీ అధ్యక్షుడు మునికుంట్ల కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో పర్వతాపూర్ శభరి గార్డెన్ ముందు నిర్వహించిన ఎస్ఐఆర్ ఎన్ రోల్ మెంట్ అవగాహన కార్యక్రమంలో వాలంటీర్స్ తో దరకాస్తు ఫారాలు పూరించే  కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి పౌరుడు సర్ లో భాగస్వామ్యం కావాలని మాజీ మేయర్ ఈ సందర్భంగా సూచించారు. లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్, కొల్తూరి మహేష్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, వివిధ డివిజన్ ల మాజీ అధ్యక్షులు, కోనేటి వెంకట్,యాసారం శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, సతీష్, అమర్ పటేల్, సుబాన్, లారెన్స్, సురేష్, అబ్దుల్‌, మునికుంట్ల ప్రదీప్ ,సందీప్ రాజీవ్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు మునికుంట్ల నరేష్ గౌడ్, బూలక్మి కాలనీ మాజీ అధ్యక్షుడు సబ్బారావు తదితరులు పాల్గొన్నారు.