16 July, 2026 | 6:45 PM

ఇచ్చిన ప్రతి హమీని నెరవేరుస్తా

06-06-2024 02:30 AM

నిజామాబాద్ ధర్మపురి ఎంపీ అర్వింద్

నిజామాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆయన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినందుకు బుధవారం బీజేపీ శ్రేణులు నిజామాబాద్‌లో సం బురాలు నిర్వహించారు. సంబురాల్లో అర్వింద్ పాల్గొని మాట్లాడారు. ప్రజలు తనపై నమ్మకంతో రెండోసారి ఎంపీగా గెలిపించారన్నారు. నిజామాబాద్‌ను వంద శాతం స్మార్ట్ సిటీగా మార్చుతానన్నారు. చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించేందుకు కృషి చేస్తానన్నారు.

కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు వాటిని గుర్తించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ అధికా రంలోకి వచ్చాక వంద రోజుల ప్రణాళిక అమ లు చేస్తుందన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పాలనలో విపరీతమైన జోక్యం చేసు కుంటున్నారని, అధికారులను నిత్యం వేధిస్తున్నారని ఆరోపించారు. పాలనపై తన ముద్ర వేసుకునే ప్రయత్నంలో యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సంబురాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ నేతలు పల్లె గంగారెడ్డి, కులచారి దినేష్ పాల్గొన్నారు.