29 June, 2026 | 2:04 AM

పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

29-06-2026 12:00 AM

చేగుంట , జూన్ 28 : ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదివారం  నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం లో చేగుంట సి హెచ్ ఓ అన్సోద్దిన్ అన్నారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని, ఏ చిన్నారి కూడా పోలియో చుక్కలు తీసుకోకుండా మిగిలిపోకూడదని కోరారు. ప్రజలు తమ పరిసరా ల్లోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చు క్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు వైద్య, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.