నిండు జీవితానికి రెండు చుక్కలు
మండల వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం
నాగలిగిద్ద, జూన్ 28: ‘నిండు జీవితానికి రెండు చుక్కలు‘ అనే నినాదంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో నాగలిగిద్ద మండలంలో తొలి రోజు 90 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం విజయవంతంగా పూర్తయ్యిందని మండల వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం తెలిపారు.మండలంలోని అన్ని పోలియో కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం నిర్వహించగా, తల్లిదండ్రులు తమ చిన్నారులను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించారని ఆమె పేర్కొన్నారు. మిగిలిన అర్హులైన చిన్నారులకు కూడా తప్పకుండా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్వైజర్ విక్టోరియా రాణి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






