09-12-2025 12:59:44 AM
సీఐ కే. నాగరాజు
చిట్యాల, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావలిని పాటించాలని నార్కట్ పల్లి సిఐ కె. నాగరాజు తెలిపారు. సోమవారం చిట్యాల మండలంలోని ఉరుమడ్ల, తాళ్ల వెళ్ళాంల గ్రామాలను ఎస్త్స్ర మామిడి రవికుమార్ తో కలిసి సందర్శించి, గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలను పాటించి శాంతియుతంగా వ్యవహరించాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని గ్రామ ప్రజలకు సూచించారు. చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.