బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు
ముగ్గురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరిక
షాద్‌నగర్,(విజయక్రాంతి): ఉగాది పర్వదినం నాడు బీఆర్ఎస్(BRS) పార్టీకి పలువురు సర్పంచులు(BRS Sarpanches) షాకిచ్చారు. మూడు గ్రామాల సర్పంచు సర్పంచులు, ఉప సర్పంచులు వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం నాడు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Shadnagar MLA Veerlapally Shankar) సమక్షంలో మద్దతు దారులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరారు.
ఫరూక్ నగర్ మండలంలోని ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీ సర్పంచ్ చందు నాయక్, ఉప సర్పంచ్ శ్రీలతతో పాటు వార్డు సభ్యులు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాళ్ళ కప్పి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లాంచనంగా పార్టీలోకి చేర్చుకున్నారు. అదేవిధంగా నందిగామ మండలం వెంకమ్మ గూడ గ్రామ సర్పంచ్ అశోక్ ఉప సర్పంచ్ యాదయ్యలు పలువురు వార్డు సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
శుక్రవారం గురువారం షాద్‌నగర్ కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా నందిగామ మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ గోవు అంజమ్మ ఉప సర్పంచ్ జింకల బసవయ్యలు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో సర్పంచ్ ఉప సర్పంచ్లు వార్డు సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.




