19 March, 2026 | 2:09 PM

దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు

19-03-2026 12:26 PM

అసదుద్దీన్ ఒవైసీ కళాశాల లో ఉగ్రమూలాలు

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం(AIMIM MLAs) ఎమ్మెల్యేల తీరు సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) మండిపడ్డారు. వందేమాతరం(Vande Mataram) ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు వెళ్లిపోయారని బండి సంజయ్ సూచించారు. కేంద్రం ఆదేశాలను ఎంఐఎం ఎమ్మెల్యేలు ధిక్కరించారని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు తప్పని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దేశంలో ఉండాలంటే అందరూ వందేమాతరం ఆలపించాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ నడిపే కళాశాలల్లో ఉగ్ర మూలాలు ఉన్నాయని బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా వందేమాతరం గీతాలాపన సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు సభలోంచి వెల్లిపోయిన విషయం తెలిసిందే. ఎంఐఎం ప్రజాప్రతినిధులు సభను బౌకాట్ చేయడంపై భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అభ్యంతరం వ్యక్తం చేసింది.