పిల్లి ఆకస్మిక మరణం.. 20 ఏళ్ల యువతి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్(Meerpet Police Station) పరిధిలోని బడంగ్‌పేట, వెంకటాద్రి కాలనీలో( Venkatadri Colony) ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. తాను పెంచుకుంటున్న పిల్లి ఆకస్మిక మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన 20 ఏళ్ల యువతి, విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం పంపారు.
తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. మీర్‌పేట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శంకర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, హిమబిందు అనే 20 ఏళ్ల బీఎస్సీ విద్యార్థిని, నిన్న తాను పెంచుకుంటున్న పిల్లి ఆకస్మిక మరణంతో మనస్తాపానికి గురై, విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం పంపి, అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించాము. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.




