19 March, 2026 | 2:21 PM

ఇలా అయితే పండుగ ఎలా..?

19-03-2026 12:41 PM

గ్యాస్ కోసం బారులు తీరిన వినియోగదారులు 

అలంపూర్: అమెరికా, ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరతకు(Gas cylinders Shortage) నిలువెత్తు సాక్ష్యం ఈ చిత్రం. తెలుగు సంవత్సరాది ఉగాదితో పాటు రంజాన్ వేళ ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదని ప్రకటిస్తున్నారు. గ్యాస్ బుకింగ్ కావడం లేదు సర్వర్ సమస్య కారణం ఆన్లైన్ రిఫీల్ బుకింగ్ కాకపోవడంతో ఉగాది పండుగనాడు గురువారం గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఖాళీ సిలిండర్లను తీసుకువచ్చి బారులు తీరారు.