29 June, 2026 | 1:42 AM

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

29-06-2026 12:46 AM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, జూన్ 28 : పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. ఆదివారం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు అయిన చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో నిర్మూలనలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.