26-11-2025 11:16:21 AM
స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయానికి మూలాధారమైన భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. రాజ్యాంగ వారసత్వం, స్ఫూర్తిని కొనసాగిస్తూ, విలువలను కాపాడుతూ సమ్మిళిత, సుసంపన్నమైన ప్రగతిశీల భారతావని నిర్మాణం కోసం, భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రజాస్వామిక స్పూర్తితో మనమంతా ముందుకు నడుద్దామని పేర్కొన్నారు.