calender_icon.png 26 November, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిరేకల్ నామినేషన్ల కేంద్రాలు ఇవే

26-11-2025 09:24:16 AM

నకిరేకల్,(విజయక్రాంతి): గ్రామ‌పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం నకిరేకల్ మండలంలోని గ్రామాలను అనుసరించి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నకిరేకల్ ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. రేపటి  నుంచి 29 వరకు, ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.

 గ్రామాల వారీగా నామినేషన్ కేంద్రాలు 

ఓగోడు, నడిగూడెం, వల్లభాపురం గ్రామాల అభ్యర్థులు

→ ఓగోడు గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలి.

నోముల, పాలెం, కడపర్తి గ్రామాల అభ్యర్థులు

→ నోముల గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి.

చందంపల్లి, గొల్లగూడెం, నెల్లిబండ, తాటికల్ గ్రామాల అభ్యర్థులు

→ తాటికల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు ఇవ్వాలి.

మంగళపల్లి, గోరెంకలపల్లి, నర్సింహాపురం, మోదినిగూడెం గ్రామాల అభ్యర్థులు

→ మంగళపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలి.

చందుపట్ల, మండలాపురం, మర్రూర్ గ్రామాల అభ్యర్థులు

  చందుపట్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు ఇవ్వాలి.