26-11-2025 10:21:56 AM
ముంబై: ముంబై ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. ఛత్రపతి మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 39 కేజీల విదేశీ గంజాయిని సీజ్ చేశారు. ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించిన గంజాయి ముఠాను గుర్తించి అధికారులు తనిఖీ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా స్మగ్లింగ్ గంజాయిని చాక్లెట్ల రూపంలో బ్యాంకాక్ నుంచి ముంబైకి తరలించారు. దీని విలువ సుమారుగా రూ.39 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. స్మగ్లింగ్ ఎత్తును పసిగట్టిన కస్టమ్స్ అధికారులు వారి గుట్టురట్టు చేశారు. ఈ మేరకు అధికారులు 8 మంది అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రధాన సూత్రధారులను గుర్తించే పనిలో ఉన్నారు.