రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం
రాజ్యాంగం ముఖ్యాంశాల పేరుతో పుస్తకాల ముద్రణ
అంబేద్కర్ కృషితోనే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు
జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ మల్లు రవి
గద్వాలలో ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు
గద్వాల, ఏప్రిల్ 14: భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగంలో అణగారిన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించ డంతో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ఆ యా వర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పించబడిందని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు డాక్టర్ మల్లు రవి అ న్నారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతినీ పురస్కరించుకొని మంగళవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గద్వాల అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఎంపీ మల్లు రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా అతిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారు లు, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన వేదిక వద్ద అంబేడ్కర్ చిత్రపటానికి పూజలు చేసి, జ్యో తి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి పీఠికను ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు పేరుతో తాను స్వయంగా 30 వేల పుస్తకాలను ముద్రింపజేసినట్లు చెప్పారు.
ప్రజలు తమ హక్కులు, బాధ్యతల ను తెలుసుకునేందుకు రాజ్యాంగంలోని ప్రా థమిక హక్కులు, ఇతర అంశాలు దోహదపడతాయన్నారు. సమాజంలోని అవస్థలు రూపుమాపాలంటే ప్రజల్లో ఉండి పోరాటం చేసేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉపయోగపడతాయన్నారు. రిజర్వేషన్స్ వల న ఎంతోమంది అణగారిన వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులుగా, ఉన్నతాధికారులుగా ఎదగడం జరిగిందన్నారు.
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల మేలుకు వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలో నూతనంగా 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయాలను స్థాపించి, అన్ని వర్గాల విద్యార్థులు అక్కడ కలిసి చదువుకునేందుకు కృషి చేస్తుందన్నారు. జిల్లాలో తరచూ విజిలెన్స్, దిశ కమిటీ, ఎన్ ఫోర్స్ మెంట్ సమావేశాలు ని ర్వహించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికిపాటుపడతామన్నారు. డోర్నకల్ నుంచి సూర్యా పేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గద్వాల రైల్వే స్థలంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానన్నారు. గద్వాలలో అంబేడ్కర్ కళాభవన్ నిర్మాణానికి, నూతన విగ్రహ ఏర్పాటుకు, బాబు జగ్జీవన్ రామ్ భవన నిర్మాణానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తానన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో, పాఠశాలల్లో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కా రానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తానన్నారు. జిల్లాలో ఇతర సమస్యల పరిష్కారానికి తన వంతుగా ఎల్లవేళలా సహకారం అందిస్తానన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ భారతరత్న అంబేడ్కర్ నిమ్న కులాల ప్రజల అ భ్యున్నతికి ఎంతో దూరదృష్టితో రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్లు కల్పించడం జరి గిందని, ఆయన తన జీవితాంతం అందరికీ స్వేచ్ఛ, సమానత్వాల కోసం కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృ తిక సారధి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అలాగే విష్ణు అనే విద్యార్థి అంబేడ్కర్ పై పాడిన పాట ఆలోచింపజేసిం ది. అంతకుముందు గద్వాల ఐడిఓసి వద్ద నిర్వహించిన వేడుకల్లో అంబేడ్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అద నపు కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి పూజ లు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారా యణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయ లక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్, జెడ్పి మాజీ చైర్పర్సన్ సరిత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






