15 April, 2026 | 3:16 AM

నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం

15-04-2026 12:00 AM

కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ ౧౪ (విజయక్రాంతి): రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవా రం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్  ఎం. డేవిడ్,  సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి తో కలసి పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వేసుకోవాలని సూచించారు. రహదారి ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తే రహవీర్ పథకం కింద రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తారని తెలిపారు. ఎమ్మె ల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ రహదారి నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో హెల్మెట్ లేకుండా ప్రమాదం జరిగితే తలకు కలిగే గాయాలను వాటర్మిలన్తో ప్రదర్శించి అవగాహన కల్పించారు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.