28-10-2025 12:00:00 AM
అదనపు ఎస్పీ చంద్రయ్య
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 27 (విజయక్రాంతి):జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం పట్టణ పరిధిలోని అం బేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ..విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, సమాజంలో శాంతి భద్రతల స్థాపనకు పోలీసులు చేస్తున్న కృషి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.అలాగే పోలీస్ శాఖ, ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
సైకిల్ ర్యా లీలో పోలీస్ అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరా వు, మధుకర్,ఆర్.ఐలు మధుకర్,రమేష్ ,యాదగిరి,ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.